ఒకరినే మనువాడిన అక్కాచెల్లెళ్లు... ఒకేసారి మరణం!

  • కరీంనగర్ జిల్లాలో ఘటన
  • గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరూ మృతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు
వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకే వ్యక్తిని ఇష్టపడ్డారు. పెళ్లాడారు. పెళ్లి తరువాత కూడా వారి మధ్య ఎటువంటి విభేదాలూ రాలేదు. ముగ్గురూ కలిసిమెలసి ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ఈ ఉదయం కరీంనగర్‌ - వరంగల్‌ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

ఓ గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో శంకరపట్నం మండలానికి చెందిన అక్కా చెల్లెళ్లు సుజాత (35), సులోచన (28) అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుని గొడవలు లేకుండా కాపురం చేసుకుంటున్నారని స్థానికులు వెల్లడించారు. ఈ అక్కాచెల్లెళ్ల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకోగా, ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు.
Go Back to Shorts
Karimnagar District
Sisters
Road Accident
Died
Police

More Telugu News